ధరణి పోర్టల్ పేరుతో లక్షలాది ఎకరాలు కొట్టేశారు: మంత్రి పొంగులేటి
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
ధరణి పోర్టల్ అడ్డుపెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూములను కొట్టేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శాసనసభలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని వాడుకుందని ఆరోపించారు. అక్రమాల భయంతోనే ప్రతిపక్షాలు అసెంబ్లీకి రావడం లేదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో భూధార్ కార్డులు తీసుకువచ్చామని స్పష్టం చేశారు.