ముగింపు దశకు ప్రఖ్యాత టాక్ షో కాఫీ విత్ కరణ్
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
ప్రఖ్యాత సెలెబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ తొమ్మిదో సీజన్‌తో ముగియనుందని ప్రముఖ దర్శకుడు, హోస్ట్ కరణ్ జోహార్ తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరించిన ఈ కార్యక్రమానికి చివరి వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో ప్రారంభమైన ఈ షో ఎన్నో వివాదాలు, మధుర జ్ఞాపతలకు వేదికగా నిలిచిందని, అభిమానుల ప్రేమాభిమానాలతోనే ఇన్ని సంవత్సరాలు విజయవంతంగా ప్రయాణించగలిగామని కరణ్ జోహార్ పేర్కొన్నారు.