విశాఖ మేయర్ పీఠం కైవసం: టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి ఘనవిజయం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అధికార కూటమి అఖండ మెజారిటీతో దక్కించుకుందని, మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కా శ్రావణి తిరుగులేని విజయం సాధించారని అధికారులు తెలిపారు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆమె ఏకంగా రెండు లక్షల ముప్ పై వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారని, విశాఖ పరిధిలోని వివిధ డివిజన్లలో కూటమి అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపిస్తోందని స్థానిక వర్గాలు వెల్లడించాయి.