ఇటలీ రైలు అనుభవం: భారతీయ రైల్వే వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పర్యాటకురాలు

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

ఇటలీలో తాను ఎదురైన రైలు అనుభవాన్ని పంచుకుంటూ భారతీయ రైల్వే వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పర్యాటకురాలు గరిమ చౌహాన్. నెపుల్స్ నుండి ఫ్లోరెన్స్ వెళ్లాల్సిన రైలు వేళలు మారడంతో ఆమె ప్రయాణం కోల్పోయారు. అయితే అక్కడి సిబ్బంది ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా టికెట్ మార్చి ఇవ్వడంతో, భారత్లో ఇలా జరగదని ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర చర్చకు దారితీశాయి.