రాజకీయాల్లో అరుదైన ఘట్టం: ఏకగ్రీవంగా ఎన్నికైన తోడికోడళ్లు మరియు ఎంపీటీసీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అరుదైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. నాయుడుపేట జడ్పీటీసీ సభ్యురాలిగా తుపాకుల కన్నెమ్మ, ఓజిలి జడ్పీటీసీ సభ్యురాలిగా వరుసకు తోడికోడలైన తుపాకుల శశిరేఖ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వీరిలో కన్నెమ్మ భర్త తుపాకుల చిరంజీవి భీమవరం ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు ఎన్నిక కావడం విశేషం.