అమెరికాలో సంచలనం: ప్రభుత్వ మోసాలపై సమాచారం ఇస్తే భారీ నజరానా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Washington
అమెరికాలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తీసుకునే వారి వివరాలు అందించి, నిధులు రాబట్టడంలో సాయపడే వారికి భారీ నజరానా అందజేస్తామని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా ఫ్రాడ్ విజిల్‌బ్లోయర్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చామని, అర్హత పొందిన వారికి గరిష్టంగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు నగదు బహుమతి లభిస్తుందని వెల్లడించారు.