22ఏ నిషేధిత జాబితా ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

తెలంగాణలో నిషేధిత ఆస్తుల జాబితాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ లేదా హెచ్ఎండీఏ అనుమతులు ఉంటే 22ఏ జాబితాలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన అధికారులు, దీనివల్ల వేలాది మంది ఆస్తి యజమానులకు ఊరట లభిస్తుందని తెలిపారు.