తెలంగాణలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ వెల్లడించింది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.