తుఫాను బాధితులకు బియ్యం అందజేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందస
శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డవూరు గ్రామంలో ఇటీవల తుఫాను కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితులకు ఒక్కో ఇంటికి యాభై కిలోల చొప్పున నిత్యావసర బియ్యాన్ని అందజేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతి మత్స్యకార కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తుఫాను సమయంలో మత్స్యకారులు ప్రాణాలను పణంగా పెట్టకుండా భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె ఈ సందర్భంగా హితవు పలికారు.