పదోన్నతులు కల్పించాలంటూ విజయవాడలో సచివాలయ ఉద్యోగుల ఆందోళన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Vijayawada

పదోన్నతులు కల్పించడంతో పాటు పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. చలో విజయవాడ నిరసన సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆరున్నరేళ్లుగా ఎలాంటి ప్రయోజనాలు అందట్లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.