క్రికెట్ వార్తలు: అజేయ శతకంతో చెలరేగిన దేవదత్ పడిక్కల్

రిపోర్టర్: శివ స్థలం: న్యూజిలాండ్

భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగారని క్రీడా వర్గాలు వెల్లడించారు. మూడో రోజు ఆటలో భాగంగా దేవదత్ పడిక్కల్ అజేయంగా 182 పరుగులు సాధించి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు. యష్ రాథోడ్తో కలిసి ఐదో వికెట్కు విలువైన వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్-ఏ ఇన్నింగ్స్ను పటిష్టమైన స్థితిలో నిలిపారని విశ్లేషకులు పేర్కొన్నారు.