దండేపల్లి మండలంలో సమస్యల పరిష్కారానికి అందరూ కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: దండేపల్లి

దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పనిచేయాలని లక్షేట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల్ల వెంకటేశ్వర్లు, నెల్కి వెంకటాపూర్ పిఎసిఎస్ చైర్మన్ తులా శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, తాసిల్దార్ రోహిత్, వివిధ శాఖల అధికారులు అలాగే ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.