రాయలసీమకు భారీ పెట్టుబడులు: 23 ఒప్పందాలతో ఐదు వేల కోట్ల ఉపాధి

రిపోర్టర్: రాజేష్ స్థలం: అనంతపురం

రాయలసీమను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అనంతపురంలో నిర్వహించిన సీఐఐ ప్రాంతీయ సదస్సులో ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు రాష్ట్ర ఆహారశుద్ధి శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. ఏపీ ఈడీబీ, సీఐఐ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వివిధ కంపెనీలతో 23 ఎంఓయూలు కుదుర్చుకోగా, దీని ద్వారా ఏడు వేలకు పైగా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.