మెదక్లో నషా ముక్త్ భారత్ ర్యాలీ: పాల్గొన్న కలెక్టర్ మరియు ప్రముఖులు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మెదక్

మెదక్ జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ మెదక్ ఘనంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తదితరులు పాల్గొని మాదకద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నేతలు పిలుపునిచ్చారు.