సాగునీటి సరఫరాలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందంటూ జగదీష్ రెడ్డి ఆగ్రహం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: సూర్యాపేట

కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కరువు సమయంలో ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మించారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కక్షతోనే ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రెండు మహారాష్ట్ర ప్రాజెక్టులను గాలికొదిలేసి పడావు పెట్టిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.