ఉప్పాడలో సముద్ర కోత నివారణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో రాకాసి అలల తాకిడికి ఇళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతుండటంతో తీర ప్రాంత వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతులు సాధించి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రక్షణ గోడ నిర్మాణం పూర్తయితే తరచూ మునిగిపోతున్న ఇళ్లకు, గ్రామానికి ముప్పు తప్పుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.