యువ నటి పుట్టినరోజు వేళ పవర్ పేట చిత్రం నుంచి ఫస్ట్ లుక్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
యువ నటి రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా పవర్ పేట చిత్ర యూనిట్ పడమటవీధి జానకి పాత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసినట్లు మేకర్స్ తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రితికా నాయక్ సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తుండగా, ఇప్పటికే అరవై శాతం చిత్రీకరణ పూర్తయినట్లు దర్శకుడు స్పష్టం చేశారు.