మురుగు నీటిలోనే నీటిని పట్టుకుంటున్న గంట్యాడ గ్రామస్థులు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెణసాం అంగన్వాడీ కేంద్రం వద్ద చేతిపంపు చుట్టూ మురుగునీరు చేరి తీవ్ర దుర్వాసన వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర వీధుల్లో కుళాయిలు లేకపోవడంతో గత్యంతరం లేక మురుగు మధ్యే నీటిని బిందెలతో పట్టుకుని తాగాల్సి వస్తోందని వాపోయారు. ఈ సమస్యను పరిశీలించి తగిన చర్యలు చేపడతామని పంచాయతీ కార్యదర్శి ధరణిశ్రీ తెలిపారు. గ్రామంలో నెలకొన్న ఈ దుస్థితిపై అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపాలని స్థానికులు కోరుతున్నారు.