సంచలన హత్య కేసును ఛేదించిన పోలీసులు: నలుగురు నిందితుల అరెస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జహీరాబాద్

జహీరాబాద్ మండలం తుంకుంట అటవీ ప్రాంతంలో శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి ఛేదించారు. మృతుని అల్లుడు బసవరాజు సుపారీ ఇచ్చి నలుగురితో ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. ఆధారాలు ధ్వంసం చేసేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. నిందితుల నుంచి నగదు, సెల్ ఫోన్లు, ఆయుధాలు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.