రూ.703 కోట్ల బీమాతో ముంబయి సంపన్న గణపతి ఉత్సవాలు!
రిపోర్టర్: సునీల్
స్థలం: మహారాష్ట్ర
ముంబయిలోని ప్రసిద్ధ జీఎస్బీ సేవామండల్ గణేశ్ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు జరిగాయి. 72వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ మండపానికి ఏకంగా రూ.703.27 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ చేయించారు. విగ్రహంపై 66 కేజీల బంగారం, 335 కేజీల వెండి ఆభరణాలు అలంకరించడమే ఇందుకు కారణం. సెప్టెంబర్ 14 నుంచి ఐదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.