డిజిటల్ అరెస్ట్ తరహా మోసం: ఎనభై లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: New Delhi
ఢిల్లీలో ఒక కళాశాల అకౌంటెంట్ ను మోసం చేసి సైబర్ కేటుగాళ్లు ఎనభై లక్షల రూపాయలు కాజేశారు. సీనియర్ అధికారినంటూ నమ్మించి వాట్సాప్ ద్వారా నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండానే డబ్బులు బదిలీ చేసినట్లు అకౌంటెంట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగి నూటికి నూరు శాతం నగదును ఫ్రీజ్ చేసి రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు.