ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం: అదుపుతప్పి కొండను ఢీకొట్టిన కారు

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుపతి

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న భక్తుల కారు అదుపుతప్పి కొండను ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మల్వాడి గుండం ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో కొంతసేపు నిలిచిపోయిన ట్రాఫిక్ను పోలీసులు క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.