ఉద్యోగానికి వెళ్తానన్న భార్యపై కత్తితో భర్త దాడి
రిపోర్టర్: మహేష్
స్థలం: గుజరాత్
అహ్మదాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేందుకు ఉద్యోగానికి వెళ్తానని చెప్పిన 20 ఏళ్ల బాలింతపై ఆమె భర్త కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. పది రోజుల పసికందు తల్లి అయిన బాధితురాలికి తీవ్ర గాయాలవడంతో సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై వాస్త్రపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.