తుపాను ముప్పు: ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలకు మంత్రి సత్యకుమార్ ఆదేశం

రిపోర్టర్: హరి స్థలం: అమరావతి

రాష్ట్రంలో తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు అన్ని ప్రభుత్వ ప్రాథమిక మరియు గ్రామ స్థాయి ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో ఇరవై నాల్గు గంటలూ పనిచేసే అత్యవసర నియంత్రణ గదులను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ, గర్భిణుల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి తక్షణమే ఆసుపత్రులకు తరలించాలని సూచించారు.