రఘునాథపురంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘ భవనంలో సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పల్లె సంతోష్ గౌడ్, బిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు.