స్థానిక ఎన్నికల అడ్డుకొనేందుకు జగన్ కుట్రలు: తెదేపా ఎమ్మెల్యే గౌతు శిరీష ధ్వజం
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి పన్నెండు వేల ఆరు వందల కోట్ల ఆర్థిక సంఘం నిధులు రాకుండా చేయాలని వైకాపా అధినేత జగన్ కుట్రలు పన్నుతున్నారని తెదేపా ఎమ్మెల్యే గౌతు శిరీష ధ్వజమెత్తారు. బెంగళూరులో కూర్చొని రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారని, రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.