అమరావతిలో ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన కేంద్రం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విదేశీయుల రిజిస్ట్రేషన్ మరియు ఇమ్మిగ్రేషన్ వ్యవహారాలన్నీ హైదరాబాద్ FRRO పరిధిలో ఉండగా, తాజా మార్పుతో అమరావతి కేంద్రంగా ప్రత్యేక అధికార పరిధి ఏర్పడింది. దీని ద్వారా విదేశీ సందర్శకులు, పెట్టుబడిదారులకు స్థానికంగా సేవలు అందనున్నాయి.