24 గంటల్లో బాలుడి అపహరణ కేసు ఛేదన

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్‌ను పోలీసులు 24 గంటల్లో సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో సురక్షితంగా రక్షించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని వైద్యపరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.