విజయనగరం జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, కలెక్టరేట్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.