మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని ఆర్వోబీలు పూర్తి చేయాలి: చంద్రబాబు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మంజూరైన 343 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణాలు మూడేళ్లలో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూసేకరణలో జాప్యం లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వేశాఖ రూ.13,305 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రహదారుల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు.