నిజమైన అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాంపల్లి
హైదరాబాద్లోని అసెంబ్లీ వేదికగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన అర్హులైన పేదలకే ఇళ్లు అందేలా నిబంధనలు సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకునే వారికి చిన్న కారణాలతో ఇళ్లు రావడం లేదని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణ నిధులు పెంచాలని, తాజా జీవో కారణంగా నిలిచిపోయిన బిల్లులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.