చిత్తూరు నగరంలోని లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక దాడులు.. అక్రమ కార్యకలాపాలకు తావిస్తే కఠిన చర్యల హెచ్చరిక!

రిపోర్టర్: RAVI BABU స్థలం: వెదురుకుప్పం

చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాడ్జీలపై ఎస్ఐ నాగప్ప నాయక్ నేతృత్వంలో పోలీసులు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు లాడ్జీలలో బస చేసిన వారి వద్ద ఉన్న గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ నమోదులు, సీసీ కెమెరాల నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లాడ్జీలలో మత్తు పదార్థాల వినియోగం, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానితుల సమాచారం వెంటనే అందించాలన్నారు.