డాక్టర్ చేవూరు చిన్నకు జాతీయ వినియోగదారుల సేవా ప్రశంస పత్రం
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన 16వ జాతీయ వినియోగదారుల సదస్సులో నెల్లూరు డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చేవూరు చిన్నకు జాతీయ సేవా ప్రశంస పత్రం లభించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాల్లో ఆయన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం అందించారు. మరోవైపు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఆర్యవైశ్య సంఘం నాయకులు కలిసి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రిక అందజేశారు.