అట్లాంటాలో భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబుకు ఘన వీడ్కోలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: USA
అట్లాంటాలో భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ పదవీకాలం ముగియడంతో తానా, తామా ఆధ్వర్యంలో ఘన వీడ్కోలు సభ నిర్వహించారు. తెలుగు కమ్యూనిటీకి ఆయన అందించిన విశిష్ట సేవలను వక్తలు కొనియాడారు. టీమ్ స్క్వేర్ సేవలను, కాన్సులేట్ సహకారాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, తానా, తామా ప్రతినిధులు రమేష్ బాబును శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.