ముంబై జెడబ్ల్యు మారియట్ హోటల్ భోజనంలో బొద్దింక ప్రత్యక్షం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ముంబైలోని ప్రసిద్ధ జెడబ్ల్యు మారియట్ హోటల్ రొమానో రెస్టారెంట్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేత్ భోజనం చేస్తుండగా టేబుల్‌పై బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో తీవ్ర విస్మయం వ్యక్తం చేసిన ఆయన, భోజనం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర ఆహార మరియు ఔషధ నియంత్రణ మండలి ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారామ్ ముండేను ట్యాగ్ చేస్తూ ఆయన ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.