అమరావతి: ఖరీఫ్ లో కొత్తగా మరో ఇరవై నాలుగు కరవు మండలాలు ప్రకటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

ఖరీఫ్ సీజన్ లో కొత్తగా ఇరవై నాలుగు కరవు మండలాలను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. ఎనిమిది జిల్లాల్ లో పన్నెండు తీవ్ర, పన్నెండు మధ్యస్థ కరవు మండలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి తేదీన ప్రకటించిన మూడు వందల ఎనభై ఎనిమిది మండలాలకు ఇవి అదనమని, రాష్ట్రంలో మొత్తం కరవు మండలాల సంఖ్య నాలుగు వందల పన్నెండుకు చేరిందని ఆయన స్పష్టం చేశారు.