'100 జెండాల పండుగ': రాజమహేంద్రవరంలో బీజేపీ భారీ కార్యక్రమం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Rajamahendravaram
రాజమహేంద్రవరం పార్లమెంట్ అర్బన్ నియోజకవర్గంలో సెప్టెంబర్ 8న '100 జెండాల పండుగ' నిర్వహించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు 100 ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం కంబాలచెరువు వద్ద రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.