వయనాడ్ లో మీడియా ఛానెల్ ఎండీ ఆంటో ఆగస్టిన్ కు జ్యుడీషియల్ రిమాండ్
రిపోర్టర్: హరి
స్థలం: వయనాడ్
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బరి కోర్టు మలయాళ న్యూస్ టెలివిజన్ ఛానెల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంటో ఆగస్టిన్ కు సెప్టెంబర్ 30 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయన పూర్వీకుల ఇంట్లో అనుమతికి మించి అక్రమంగా మద్యం సీసాలు లభ్యం కావడంతో ఎక్సైజ్ కస్టడీ ముగిసిన అనంతరం మేజిస్ట్రేట్ అదీనా బిజు ఎదుట హాజరుపరిచారు. విఫలమైన ఫుట్బాల్ ఈవెంట్కు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపిన తనిఖీల్లో ఈ మద్యం సీసాలు బయటపడ్డాయి. దీంతో ఆంటో ఆగస్టిన్ను మానంతవాడి జిల్లా జైలుకు తరలించగా, ఆయన తరఫు న్యాయవాదులు కేరళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.