గురుద్వారాలో పోలీసుల బూట్లతో సంచలనం: తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ నేతలు
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలోని ప్రముఖ గురుద్వారా బంగ్లా సాహిబ్ ప్రాంగణంలో పోలీసులు బూట్లతో నడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది దుర్బుద్ధితో సర్క్యులేట్ చేసిన వీడియో అని, అది బూట్లు విప్పే ప్రాంతానికి వెళ్లే సాధారణ మార్గమని ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.