నిద్రలేమి సమస్యలపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భావోద్వేగ పోస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
నిద్రలేమి సమస్యలు మరియు జిమ్ రొటీన్ పై ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు. వయసురీత్యా శరీరం కోరుకుంటున్న విశ్రాంతి గురించి ఆయన తన బ్లాగ్ వేదికగా స్పష్టం చేశారు. మనసు పనిచేయమన్నా శరీరం సహకరించడం లేదని, నిద్ర పట్టక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూనే కౌన్ బనేగా కరోడ్ పతి షో హోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.