మనుబోలులో వైభవంగా వరలక్ష్మీ వ్రత పూజలు
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
మనుబోలు మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రావణమాస నాలుగవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు హనుమయ్య శర్మ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.