బొబ్బిలిలో ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ ప్లాట్ల విక్రయాలపై కొత్త మార్గదర్శకాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: బొబ్బిలి

పేద, మధ్య తరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ స్మార్ట్ సిటీల పేరుతో లేఅవుట్లను అభివృద్ధి చేస్తోంది. లాటరీ పద్ధతిలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ప్లాట్ల విక్రయాలకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బొబ్బిలి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఈ ప్లాట్లను బహిరంగ వేలం పద్ధతిలో విక్రయించనున్నారు. దీనివల్ల కేటాయింపులు పారదర్శకంగా జరగడంతో పాటు బుడా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.