కొండపిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా శ్రీబాల

రిపోర్టర్: సురేష్ స్థలం: ప్రకాశం

ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండపి నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ఈ పర్యటన నేపథ్యంలో జరుగుమల్లి మండలం నర్సింగోలులో హెలిప్యాడ్, ప్రజా వేదిక మరియు పార్టీ క్యాడర్ సమావేశాల నిర్వహణకు కేటాయించిన స్థలాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.