సీఎం రేవంత్, కేసీఆర్ ఆస్తులపై న్యాయ విచారణ కోరిన రఘునందన్ రావు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాల ఆస్తులపై హైకోర్టులో న్యాయ విచారణ జరిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇరు పార్టీల నేతలు పరస్పరం చేసుకున్న ఆరోపణలు, లక్ష కోట్ల అక్రమాలపై ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. అదనపు ఆస్తులను గుర్తించి ప్రజాధనాన్ని వెనక్కి రప్పించాలని, మంగళవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కూ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.