బోర్ల పనులు చేపట్టాలని కోరుతూ వినాయకుడికి గిరిజనుల వినూత్న విజ్ఞప్తి
రిపోర్టర్: సురేష్
స్థలం: ఖమ్మం
సత్తుపల్లి మండలం యాతాలకుంట గిరిజనులు వినూత్న నిరసన చేపట్టారు. సీఎం గిరి వికాస్ పథకం కింద మంజూరైన బోర్ల పనులు నిధుల కొరతతో నిలిచిపోవడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినాయకుడికి పూజలు చేసి వినతిపత్రం సమర్పించారు. సాగునీటి సమస్య తీర్చి, వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని గణేషుడిని వేడుకున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.