విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనల పెంపు: హైదరాబాద్లో బీఏఎస్ఎఫ్ కిడ్స్ ల్యాబ్ ప్రారంభం
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్లో బీఏఎస్ఎఫ్ కిడ్స్ ల్యాబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సీఎస్ఐఆర్ ఐఐసీటీ సహకారంతో చేపట్టిన ఈ వేడుక ద్వారా మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోగాత్మక రసాయన శాస్త్ర విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా నీటి శుద్ధి వంటి ప్రయోగాలపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.