కామారెడ్డిలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ: ధరల పట్టిక ప్రదర్శించకపోవడంపై తీవ్ర ఆందోళన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Kamareddy
కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని చికిత్సల ధరలను ఇంగ్లీష్ తో పాటు స్థానిక భాషలో ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించినా ఎక్కడా బోర్డులు పెట్టలేదని తెలిపారు. పరీక్షల పేరుతో అదనపు వసూళ్లు చేస్తూ రోగులను నిండా ముంచుతున్నారని, వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.