తిరుమలలో భక్తుల ప్రయాణ సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ విధానం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమల

తిరుమలలో భక్తుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు తితిదే అధికారులు సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉచిత ఎలక్ట్రిక్ ధర్మ రథం బస్సుల వివరాలు స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. తిరుమలలోని ఇరవై ప్రధాన బస్టాప్ లలో ఈ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా బస్సుల రూట్ మ్యాప్ లతో పాటు గమ్యస్థానాలను సులభంగా గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నారు.