ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగన్న పరామర్శ.. పరామర్శించిన భూక్యా జాన్సన్ నాయక్
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగన్న అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.
లింగన్న ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.