శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వేళ వర్కౌట్లు చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు: వైద్యులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలు కనిపిస్తున్న సమయంలో జిమ్లో వర్కౌట్లు చేయడం తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. మెడకు పైభాగంలో ఉంటే పర్వాలేదని, కానీ ఛాతీ వరకు ఇన్ఫెక్షన్ చేరితే వెంటనే వ్యాయామం నిలిపివేయాలని సూచించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రమించవద్దని, సీడీసీ మార్గదర్శకాలను పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు హెచ్చరించారు.